Hello Madiga….Chalo Delhi .. Make the Madiga Mahadharna a success
కనుకుంట్ల సమ్మయ్య మాదిగ.
తెలంగాణ మాదిగ హక్కుల దండోరా ప్రధాన కార్యదర్శి
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గంగానగర్లో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం,ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగు చలో ఢిల్లీ కలపత్రాలనుTMHD కార్పొరేషన్ కమిటీ ఆధ్వర్యంలో విడుదల చెయ్యడం జరిగినది
ఈ కార్యక్రమాన్నికి ముఖ్య అతిధిగా TMHD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుట్ల సమ్మయ్య మాదిగ మాట్లాడుతూ తెలంగాణ మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు జన్నుకనకరాజ్ మాదిగ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ SC ABCD వర్గీకరణ పైన,అవాలంభిస్తున్న నిర్లక్ష్యం, కోర్ట్ కేసులతో కాలయాపన చేస్తున్నందుకు నిరసనగా ఆగస్టు 6.7.తేదీలలో ఢిల్లీ లోని జంతర్ మంతర్ మాదిగ ధర్నా కలదు.
గతం లో బీజేపీ పార్టీ పెద్దలు ప్రధాన మంత్రి, నరేంద్ర మోడీ, సుష్మ స్వరాజ్, కిషన్ రెడ్డి పెద్దలు అధికారం లోకి వచ్చిన తర్వాత చేస్తా అని 10సంవత్సరాలనుండి 15 సంవత్సరాలు అవుతున్న, పార్లమెంట్ లో 1/3 మెజారిటీ వున్నా, sc abcd వర్గీకరణ బిల్లు పెట్టకుండా కాలయాపన చేస్తున్నా కేంద్ర బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా హలో మాదిగ చెల్లో ఢిల్లీ తెలంగాణ మాదిగ హక్కుల దండోరా పక్షాన జరుగుతుంది.. ఇట్టి ధర్నా కు ఉమ్మడి కరంనగర్ జిల్లా, పెద్ద పల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం నుండి TMHD నాయకులు, విద్యార్థి నాయకులు, కార్యకర్తలు అధిసంఖ్యలో తరలి వచ్చి విజవంతం చేయ్యాలని కోరుకుంటున్నాము
ఈ కార్యక్రమం లో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుట్ల సమ్మయ్య మాదిగ,జిల్లా అధికార ప్రతినిధి ఉప్పులేటి శంకర్ మాదిగ..కార్పొరేషన్ అధ్యక్షులు కుడిదల వెంకటేష్ మాదిగ. జిల్లా యువ సేన అధ్యక్షులు తోకల ప్రశాంత్ మాదిగ… కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి బచ్చల కొమురయ్య..నక్క రాజేష్.. K. శ్రీనివాస్. రోహిత్ పాలుగోన్నారు జై.మాదిగ . జై జై మాదిగ.. ఉద్యమ నమస్కారమూలతో
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App