
మంచు తుఫాన్‌తో కెనడా విలవిల్లాడుతోంది. ముసురు పట్టినట్టుగా నాన్‌స్టాప్‌గా మంచు వర్షం కురుస్తోంది. కెనడా మొత్తం మంచుతో నిండిపోయింది. ఇళ్లు, భవనాలు, రోడ్లు… ఇలా ఏది చూసినా.. ఎటుచూసినా కనుచూపు మేర మంచే కనిపిస్తోంది. భారీ మంచు తుఫాన్ కారణంగా రోడ్లపై దట్టంగా మంచు పేరుకుపోతోంది. రోడ్లపై మంచును ఎప్పటికప్పుడు తొలగిస్తున్నా క్షణాల్లోనే మళ్లీ మంచు కమ్మేస్తోంది. కుండపోత వాన కురిసినట్టుగా దంచికొడుతోంది మంచువర్షం.
