TRINETHRAM NEWS

Heavy rains for 4 days

Trinethram News : Telangana : ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక
18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్లో అకస్మాత్తుగా భారీ వర్షాలు పడతాయని వెల్లడి
హైదరాబాద్ : రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ఇచ్చింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

హైదరాబాద్ కు కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజుల పాటు సిటీలో అనూహ్యంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉదయమంతా మబ్బులు పట్టి, అకస్మాత్తుగా వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉన్నట్టుండి జల్లులతో పాటు కుంభవృష్టి కురిసే అవకాశాలున్నట్టు తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Heavy rains for 4 days