TRINETHRAM NEWS

Heavy rain in Tirumala

Trinethram News : తిరుపతి జిల్లా: సెప్టెంబర్
తిరుమలలో ఈరోజు మధ్యాహ్నం భారీగా వర్షం కురుసింది. ఉదయం 10 గంటల నుంచి కొండపై ఎండకాసినా మధ్యాహ్నానికి వాతావరణం చల్లబడింది.

ఒక్కసారిగా నల్లని మబ్బులు కమ్ముకొచ్చాయి. వెంటనే ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. తేలికపాటితో మొదలై కుండపోతగా కురిసింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.

అయితే ఈ వర్షంలో తిరు మలగిరులు కనువిందు చేశాయి. చిటపట చిను కులతో ప్రకృతి అందాలన్నీ ఒకేచోట కనిపించాయి. దీంతో భక్తులు తిరుమల అందాలను తనివితీరా ఆస్వాదించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Heavy rain in Tirumala