TRINETHRAM NEWS

జీవో నెంబర్ 3 పునరుద్ధరణ సంగతేంటి. – ( ASK) ఆదివాసి సంఘాల కూటమి నాయకులు.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( అడ్డతీగల ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, అడ్డతీగల మండలం, 20 వేల మంది గిరిజన విద్యార్థులతో మెగా యోగ సరే!

మరి గిరిజనుల కోసం మెగా ఏజెన్సీ DSC ఎప్పుడు?

G.O 3 పై ఇచ్చిన ఎన్నికల హామీ సంగతి ఏంటి? మోసమా?

ఆదివాసీ సంఘాల కూటమి(ASK) నాయకులు.

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, అల్లూరిజిల్లాలో ఏప్రిల్ 7 న, 20 వేల మంది గిరిజన విద్యార్థులతో ‘మహా సూర్య నమస్కారం’ పేరిట మెగా యోగ కార్యక్రమం నిర్వహించడం మంచిదే, అయితే యోగ ఎవరు చేస్తారో ఆ వ్యక్తి ఆరోగ్యం మాత్రమే బాగుంటుంది. అలా అని మిగిత వారి ఆరోగ్యాలు బాగుండవా? యోగ చేసిన, చేయకపోయినా మా బ్రతుకులు మారవని, మా పూర్వికులు ఎవరు యోగలు చేయలేదని, అయిన వారు ఆరోగ్యం గానే ఉన్నారని, మెగా యోగ సరే! మాకు కావలసింది గిన్నిస్ రికార్డ్ కాదు,

మా గిరిజన బ్రతుకులు మార్చండి అని”ఆదివాసీ చైతన్య వేదిక సంక్షేమ సంఘాం” అధ్యక్షులు వెదుళ్ల లచ్చిరెడ్డి, మరియు “ఆదివాసీ సంక్షేమ పరిషత్”(274/16) జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు అన్నారు.
కూటమి అధికారంలోకి వస్తే G.O.no.3 ని పునరుద్దరణ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, ప్రస్తుతం దాని సంగతే మర్చిపోయారని, ఏప్రిల్ లో నోటిఫికేషన్ ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూటమి ప్రభుత్వం తెలిపిందని, మా గిరిజన బ్రతుకులు మార్చి, మా కుటుంబాలకు భరోసా నిచ్చే G.O.3 కోసం మాట్లాడకుండా, మా కుటుంబాలకు ఎలాంటి భరోసా కల్పించని, మెగా యోగ కార్యక్రమం ద్వారా గిన్నిస్ రికార్డ్ కోసం ప్రభుత్వం ప్రాకులాడటం విడ్డురంగా ఉందని, గిరిజనుల కోసం మెగా DSC ఎప్పుడు ఇస్తారో చెప్పాలని అన్నారు.
కూటమి ప్రభుత్వం G.O. 3 పై ఇచ్చిన ఎన్నికల హామీ సంగతి ఏంటో గిరిజన సమాజానికి తెలియజేయాలని, ఆ హామీ ఇప్పుడు నెరవేర్చకపోతే గిరిజనులను మోసం చేసిన వారు అవుతారని అన్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ది చెప్తామని , బారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ఆదివాసి సంఘాల కూటమి (ASK) నాయకులు మీడియా ముందు అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Health is okay, when