తల సేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం రక్తదానం చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
Hdfc రామగుండం బ్రాంచ్ ఆధ్వర్యంలో తల సేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. రామగుండం బ్రాంచ్ మేనేజర్ సిహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త, సీనియర్ బ్యాంక్ ఖాతాదారులు కోలేటి శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లాలోని తలసేమియా వ్యాధిగ్రస్తులను కాపాడేందుకు హెచ్ డి ఎఫ్ సి సిబ్బంది చేస్తున్న చోరవ రక్తదాన శిబిరాన్ని అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆపరేషన్ మేనేజర్ కుమారస్వామి, ఎన్టిపిసి బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్, సంజీవ్ తో పాటు బ్యాంక్ సిబ్బంది, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App