జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు.
వైసీపీని అధికారం నుంచి దించడమంటే.. చంద్రబాబును గద్దెనెక్కించడమా? అని ప్రశ్నించారు.
చంద్రబాబుకు అధికారం కోసం కాపులు.. పవన్ కళ్యాణ్ వెంట నడవటం లేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో 40 నుంచి 60 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని సూచించారు.
అధికారంలోకి వస్తే రెండున్నరేళ్లు పవన్ ముఖ్యమంత్రిగా ఉంటాడని చంద్రబాబు ప్రకటించాలని లేఖలో డిమాండ్ చేశారు.