హ్యాపీ సేవా సంస్థ దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 6: నెల్లూరు జిల్లా: కావలి. కావలి పట్టణ వెంగళరావు నగర్ లో గల నాగసాయి బాబా మందిరంలో దుప్పట్లు, అన్న సంతర్పణ నిర్వహించారు. సాయి లీలా మృతం పోయిన గురువారం నుండి ప్రారంబమై ఈ గురువారందాక చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి దివ్యాంగులకు వస్త్రాధానం తో పాటు అన్నదానం నిర్వహించారు.
ఈ సందర్భముగా హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్. ఘనిబాషా మాట్లాడుతూ మంచి మనసున్న మారాజు , కొండా. వెంకట్రామిరెడ్డి , ధాత్రుత్వం తో ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో నాగసాయి బాబా ఆలయ కమిటీ అధ్యక్షులు కొత్తపల్లి. ప్రభాకర్ రెడ్డీ, సభ్యులు బాపట్ల. గంగయ్య, బి.బాలిరెడ్డి, చేజర్ల. మాలకొండారెడ్డి, దాత. కొండా. వెంకట్రామిరెడ్డి, హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్. ఘనిబాషా, సలహాదారులు చెవూరు. ప్రభయ్య తదితరులున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App