TRINETHRAM NEWS

ముస్లిం సోదరుల పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్ లో గల ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం సోదరులతో కలిసి పార్ధనా కార్యక్రమంలో పాల్గొని, సోదరీమణులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ పవిత్ర రంజాన్ మాసం లో కఠిన నిర్ణయాలతో ఉపవాసాలు ఉండి ఆ అల్లా ను ప్రాదించే ప్రతి ప్రాధనా అల్లా విని, వారి కోరికలను నేరవేర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మరోసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.