TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్..

ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
-నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి
-రాజకీయాల్లో ఓపిక చాలా అవసరం
-పరిస్థితులు ఎప్పుడూ ఓకేలాగా ఉండవు, వాటికనుగుణంగా నడుచుకోవాలి
-నూతన ఏడాది ప్రజలకు సరికొత్త ఉత్సాహాన్నివ్వాలి
-బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

ప్రజలందరికీ బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నూతన సంవత్సరం-2025 శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఆశలు, ఆశయాలతో ప్రతీ ఒక్కరూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని ఆయన ఆకాంక్షించారు. నిర్దిష్ట లక్ష్యాలను రూపొందించుకుని యువత తమ ఆశయ సాధనకై ముందుకు సాగాలని కోరారు. జీవితం పట్ల సరైన దృక్పథం, సంకల్ప బలం ఉంటేనే లక్ష్య సాధనలో సఫలీకృతులవుతారని ఉద్ఘాటించారు. ఎన్నో అవాంతరాలు, సమస్యలు, వివక్షను ఎదుర్కుంటూ నేడు భారత దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం అందరికీ ఆదర్శనీయమని స్పష్టం చేశారు. అనతికాలంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి రోల్ మోడల్ గా మారిందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ దినదినాన మరింత బలోపేతం అవుతోందని, బీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉన్న కార్యకర్తలంతా కొత్త ఏడాదిలో కూడా పార్టీ ప్రతిష్ట కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.2025 కొత్త సంవత్సర వేళ ప్రతి కుటుంబంలో ఆనందం, సంతోషం వెల్లి విరియాలని.. రాష్ట్ర ప్రజలు, రైతులు పాడిపంటలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అన్నారు.అలాగే గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని, కోరుకుంటున్నానని తెలిపారు.ఈ నూతన సంవత్సరంలో మీ అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నిండాలని,నూతన ఉత్సాహంతో సరికొత్త ప్రణాళికలతో మీరు మరింత ముందుకు వెళ్లి విజయం సాధించాలని..

మీరు అనుకున్న పనులు సంకల్ప శక్తితో సాధించి, ముందుకు వెళతారని ఆశిస్తున్నానని అన్నారు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలంటే గత చేదు అనుభవాలను ఎప్పటికీ గుర్తు చేసుకోకూడదని, కేవలం భవిష్యత్తు ప్రణాళిక పై దృష్టి సారిస్తే అందరూ తప్పకుండా విజయం సాధిస్తారని అన్నారు. పరిస్థితులు ఎప్పుడూ ఓకేలాగా ఉండవు,వాటిని గమనించాలి దానిని బట్టి నడుచుకోవాలి.రాబోయే రోజుల్లో ప్రస్తుతం యువకులుగా ఉండి, పార్టీలో పనిచేస్తున్న వారికి ఉజ్వలమైన రాజకీయ భవిషత్తు ఉంటుందని, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, దానివల్ల నష్టం తప్ప,లాభం ఉండదని తెలిపారు.రాజకీయాల్లో ఓపిక అవసరమని, అవకాశాలు వచ్చే వరకు, ఉండి,ఆ సమయం వచ్చినప్పుడు అంది పుచ్చుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రజలు, దేవరకొండ నియోజకవర్గ ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App