
ఘనంగా యంగ్ డైనమిక్ లీడర్ నారా లోకేష్ జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : ఘనంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు.
అల్లూరి జిల్లా, పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి టూరిజం డైరెక్టర్ కిల్లు వెంకట రమేష్ నాయుడు ఆధ్వర్యంలో కొయ్యూరు మండల కేంద్రంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సింగవరం సాయిబాబా మందిరం లో ప్రత్యేక పూజలు చేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఇంకా ఉన్నత స్థాయి పదవులు పొందాలని ఆకాంక్షించారు. తర్వాత కేక్ కట్ చేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు,పాలు, బ్రెడ్,ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. అలాగునే మర్రివాడ స్కూల్లో సుమారు 70 మంది పిల్లలకు బుక్స్, పెన్నులు, స్వీట్స్ పంపిణీ చేశారు.
ఈ యొక్క కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ గొలిసింగి సత్యనారాయణ, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి కొర్రు రామమూర్తి, తెలుగు నాడు విద్యార్థి విభాగం అధ్యక్షులు పొటుకూరు సన్యాసిరావు, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు కొర్రు పుల్లయ్య, వై.వరహాలు బాబు, మాజీ సర్పంచులు సాలెపు సన్యాసిరావు, పలాల అబ్బారెడ్డి,మండల మహిళా కార్యదర్శి శ్యామల వరలక్ష్మి, పొత్తూరు దేవుడు, టిడిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
