
డిండి గుండ్ల పల్లి త్రినేత్రం న్యూస్.
తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది పై అవినీతి ఆరోపణలు.
కొంతమంది జేబులు నింపుతున్న ధరణి.
రైతుల రక్తాన్ని జలగల్ల పీలుస్తున్న కొంతమంది అధికారులు.
చేయి తడవనిదే ఫైల్ కదలని పరిస్థితి.
డిండి తహసిల్దార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతుందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. చేతులు తడిపితేనే ఫైల్స్ కదలడం లేదని సమాచారం దీంతో కార్యాలయం చుట్టూ తిరగలేక మండల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
ధరణిలో మిస్సింగ్ సర్వే నెంబర్లు కొంతమంది రెవెన్యూ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి మిస్ అయిన నంబర్లలో ఉన్న భూమి విస్తీనాన్ని బట్టి ధరను నిర్ణయించి కార్యాల యంలో కొందరు రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం.
గుంట భూమి మొదలుకొని 50 వేలు, ఎకరాకు పైన ఉంటే లక్ష వరకు వసూలు చేస్తున్నారని సమాచారం రైతుల అమాయకత్వా న్ని ఆసరాగా చేసుకుని తహసిల్దార్ కార్యాలయంలో ముగ్గురు అధికారులు కార్యాలయంలో చక్రం తిప్పుతున్నారని పలువురు ప్రజలు పేర్కొంటున్నారు. ఇంతకుముందు ఒకరు అవినీతికి పాల్పడుతూ గత నెల 17 తారీఖున రెండోసారి ఏసీబీ అధికారులకు దొరికాడు.
పనిష్మెంట్ పై వచ్చిన ఇక్కడ విధుల్లో చేరి తన తీరు మార్చుకోలేదు. పైసలు ఇస్తే నిబంధనలకు విరుద్ధంగా ఏ పని చేయడానికి అయినా వెనుకాడడం లేదని ఆధార్ కార్డులను మారుస్తూ తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గతంలో పనిచేసిన తహసిల్దార్లు సంతకాల కోడ్ జరిగితే ప్రొసీడింగ్లు తీసి ప్రభుత్వ భూములతో పాటు వివాదాల్లో ఉన్న భూములకు కూడా పట్టాలు జారీ చేసినట్లు సమాచారం. ఏజెంట్లను గ్రామాలలో ఏర్పాటు చేసుకొని ఇద్దరు అధికారులు వసూళ్ల దందా కొనసాగిస్తున్నారు. గతంలో మనువల్ గా పట్టాదారు పాస్ పుస్తకాల్లో నమోదైన భూములు ధరణిలోకి నమోదు కాలేదు.
మండలంలో 38 గ్రామపంచాయతీలో మిస్సింగ్ సర్వే నెంబర్లు డేటా కరెక్షన్ టి యం 33, పేర్ల సవరణ, బ్యాక్ లాక్ రిజిస్ట్రేషన్, టీఎం 4, టీ ఏం,5, పిఓబి సమస్యలు, విస్తీర్ణం తక్కువగా ఉండటం పట్టా భూములు ప్రభుత్వ భూములుగా నమోదు కావడం వంటి సమస్యల పరిష్కారం కోసం 1200 దరఖాస్తులు తహసిల్దార్ కు రైతులు అందజేశారు. వీటిలో కొన్ని పరిష్కారం కాగా కొన్ని దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.
డిజిటల్ పాస్ పుస్తకాల్లో ఉండాల్సిన భూమి కంటే తక్కువగా ఉండటం, డిజిటల్ పాస్ పుస్తకాల్లో ఉండాల్సిన భూమి కంటే తక్కువగా ఉండటంతో ఆందోళన చెందినా రైతులు ప్రజలు రెవిన్యూ అధికారులు అడిగినంత నగదును చేతిలో పెడుతున్నారు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా కార్యాలయానికి వచ్చిన రైతులను ఇద్దరు వ్యక్తులు బెదరగొడుతున్నారు అంతే కాకుండా కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన రైతులు దళారీలను ఆశ్రయిస్తున్నారు మండలంలోని ఒక తండాకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధి 8 లక్షల రూపాయలు డిండి రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులలో ఒకరికి అప్పజెప్పినట్లు సమాచారం మండలంలో 38 గ్రామపంచాయతీలలో సుమారు 43 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
సాగు భూములకు ధరలు అమాంతం పెరగడంతో తమ సెంటు భూమిని కూడా రైతులు వదులుకోవడానికి ఇష్టపడటం లేదు ఏ విధంగానైనా తమ భూమిని ధరణిలో నమోదు చేసుకోవడానికి చాలా ఖర్చు చేస్తున్నారు ధరణిలో మిస్సింగ్ నెంబర్ల తో డిండి తహసీల్దార్ కార్యాలయంలో ఒక కోటి రూపాయలు దాకా చేతులు మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ లోని ఒక హోటల్లో మకాం వేసి కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ తో తమ పనులను కార్యాలయ అధికారులు చేయిస్తున్నట్లు సమాచారం మండలంలో గ్రామపంచాయతీల్లో ఎవరిని పలకరించిన తహసిల్దార్ కార్యాలయంలో అధికారులకు తమ సమస్యల పరిష్కారం కోసం నగదును అప్పజెప్పినట్లు చెబుతున్నారు మండల పరిధిలోని రామంతాపూర్ గ్రామానికి చెందిన ఒక మహిళ రూపాయలు 40000 కార్యాలయంలో ఒక అధికారికి చెల్లించినట్లు చెబుతోంది.
వావిల్ కోల్ గ్రామానికి చెందిన వితంతు మహిళ నుంచి ధరణిలోని సమస్య పరిష్కారం 40000 చెల్లించినట్లు తెలుస్తుంది. ఖానాపూర్ గ్రామానికి చెందిన ఒక రైతు తన వ్యవసాయ భూమిలో కొంత భాగాన్ని విక్రయించాడు. ఆ భూమి రిజిస్ట్రేషన్ సమయంలో విక్రయించిన భూమిపై బ్యాంకులో ఎలాంటి రుణం పొందలేదని బ్యాంక్ అధికారుల నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తేవాలని ఆదేశించారు. తన వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో ఆ రైతు నుంచి పది వేలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేశారని సమాచారం.
నిజాం నగర్ కు చెందిన ఇద్దరు రైతుల నుంచి మూడు లక్షల డిమాండ్ చేసి రెండు లక్షలకు ఒక రాజకీయ పార్టీ నాయకుడి ద్వారా తీసుకున్నట్లు వినికిడి. బొల్లనపల్లి గ్రామానికి చెందిన మాజీ ప్రజా ప్రతినిధి నుంచి తన 36 గుంటల భూమి ని ఆన్లైన్ చేసేందుకు 50వేల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. డిండి గ్రామానికి చెందిన ఒక మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నుంచి 2.40లక్షలు తీసుకున్నట్లు సమాచారం.
గొల్లనపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు సర్వేనెంబర్ 264 లో రెండు ఎకరాల భూమిని పట్టా చేసేందుకు 50,000 చెల్లించినట్లు తెలుస్తోంది. బ్రాహ్మణపల్లికి చెందిన ఒక రైతు ఎకరా భూమి మిస్సింగ్ సర్వే నెంబర్లు నమోదయింది తన భూమిని ధరణిలో చేర్చి డిజిటల్ పాస్ పుస్తకం జారీ చేసేందుకు ఆరు నెలల క్రితం మధ్యవర్తి ద్వారా 50వేల రూపాయలు చెల్లించినట్లు సమాచారం.
ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య భూమి వివాదం నెలకొని కోర్టు వరకు వెళ్లారు కోర్టులో వాయిదా నడుస్తున్నప్పుడు వివాదంలో ఉన్న భూమికి సంబంధించి ఎలాంటి పట్టాలు జారీ చేయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ, 1.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని డిజిటల్ పాస్ పుస్తకం జారీ చేసినట్లు తెలుస్తుంది.
కళ్యాణ లక్ష్మి చెక్కులు జారీ చేసేందుకు 5000 ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం 500 నుంచి 6000 వరకు, బ్యాంకు నుంచి నో డ్యూ సర్టిఫికెట్ దేని యెడల 3000 నుంచి 10000 వరకు తాసిల్దార్ కార్యాలయంలో వసూలు చేస్తున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఇనాం భూములను కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు సమాచారం.
పై విషయంపై వివరణ కోరగా దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి మాట్లాడుతూ ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటా మనీ, అవినీతి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు చేస్తే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని సమస్యలపై పరిష్కారానికి కృషి చేస్తామని, కొందరు అవినీతికి పాల్పడినట్లు తన దృష్టికి వచ్చింది పద్ధతి మార్చుకోకపోతే చర్యలు ఉంటాయని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
