
తేదీ : 20/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీయస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది.
ఇటీవల ఆర్టీసీపై సమీక్ష చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు 2016కు ముందు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 800 పైగా ఈ నిర్ణయం ఉపశమనం కల్పిస్తుందని అధికారులు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
