తేదీ : 26/01/2025.
ఘనంగా బైబిల్ మిషన్ మహోత్సవాలు.
గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గం, మండలం, కాజా గ్రామంలో ఉన్న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా స్థలం ఆవరణంలో ఫాదర్ యం. దేవదాసు అయ్యగారు ఏర్పరచినటువంటి బైబిల్ మిషన్ 87వ మహోత్సవములు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ మహోత్సవము ను కూటమి ప్రభుత్వ అధికారంతో జరిపించడం చాలా సంతోషం.
వచ్చిన వారందరికీ ఎవరికి ఎటువంటి సమస్యలు లేకుండా ఉచిత ఆరోగ్య వైద్యశాలను ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ అధికారులు , అన్ని శాఖల అధికారులు సహకరించడం శుభ పరిణామం. విశ్వాసుల ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ శాఖ వారు సహకరించారు. లక్షలాదిగా విశ్వాసులు పాల్గొనడం జరిగింది. ఈ మహోత్సవాలు 87 సంవత్సరముల నుండి ఇదే స్థలములో జరుగుతున్నాయి.
ప్రభుత్వం అనుమతి ఇచ్చినందుకు గాను జె. శామ్యూల్ కిరణ్ బాబు ధన్యవాదములు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App