జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 14 at 7.24.28 PM

TRINETHRAM NEWS

14.01.2024
అమరావతి

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

అందరికీ మంచి జరగాలంటూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

సంప్రదాయ పంచెకట్టుతో సతీసమేతంగా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ కార్యాలయం గోశాల వద్ద వైభవంగా జరిగిన సంబరాలు, గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు, పూర్తిగా పల్లె వాతావరణం, అభివృద్ది కార్యక్రమాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు

వందేళ్ళ క్రితం తిరుమల ఏ విధంగా ఉండేదో అదే తరహాలో ప్రత్యేకంగా సెట్టింగ్‌

సీఎం దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు, గంగిరెద్దులకు సారెను సమర్పించడం, భోగిమంటలు, గోశాలలోని గోవులకు ప్రత్యేక పూజలు, హరిదాసుల కీర్తనలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలతో వైభవంగా వేడుకలు

ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

హాజరైన డిప్యూటీ సీఎంలు కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ.సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు.

You cannot copy content of this page