TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : అనపర్తి. మార్చి 27 కార్పెంటర్స్ డే పురస్కరించుకుని అనపర్తి కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు గోపిశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కార్పెంటర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్పెంటర్స్ ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ వాహనంపై ఊరేగారు. ఈ సందర్భంగా అధికారులను, నాయకులను కలిసి కార్పెంటర్ల సమస్యల పరిష్కారించాలని అభ్యర్థించారు.

కార్పెంటర్లు కూటమి నేతలను కలిసిన సందర్భంగా కేకులు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు బొబ్బిలి బుచ్చయ్య, కార్యదర్శి గాజుల వెంకట మహేష్, కోశాధికారి షేక్ నాగూర్ బాబు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Grand Carpenter's Day celebrations