TRINETHRAM NEWS

Grand birthday celebrations of Congress party leader Rahul Gandhi

జూన్ 19, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంపిణీ చేశారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ భవిష్యత్ లో భారత ప్రధానిగా రాహుల్ గాంధీ పాలన సాగించడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Grand birthday celebrations of Congress party leader Rahul Gandhi