
త్రినేత్రం న్యూస్ : అనపర్తి. ఈరోజు అనగా 25 -03 -2025 మంగళవారం నాడు అనపర్తి శ్రీ చైతన్య స్కూల్లో గ్రాడ్యుయేషన్ సంబరాలు అద్భుతంగా జరిగాయి . ప్రీ ప్రైమరీ నుండి ప్రైమరీకి అనగా U KG నుండి ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్న విద్యార్థులకు ప్రైమరీ నుండి హై స్కూల్ కి అనగా 5th క్లాస్ నుండి 6th క్లాస్ కు వెళ్తున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సంబరాలు జరిగాయి .విద్యార్థులకు ఫస్ట్ క్లాస్ లో ఉన్న లెసన్స్ మరియు సిక్స్త్ క్లాస్ లో లెసన్స్ ఎలా ఉంటాయి అనేది అద్భుతంగా వివరించి విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టా ,సర్టిఫికెట్ మరియు గోల్డ్ మెడల్ ఇచ్చి వారిని వారి తల్లిదండ్రుల సమక్షంలో సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ ఇన్చార్జ్ అరుణ మేడం, ప్రైమరీ ఇన్చార్జ్ విష్ణుప్రియ మేడం, హై స్కూల్ డీన్ రాజు , ప్రిన్సిపాల్ వి.ఎన్ .రత్నాజీ , మరియు టీచర్స్ అందరూ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పెద్దల సమక్షంలో చాలా అద్భుతంగా జయప్రదంగా జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
