
కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి సహకరించండి..
ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ నందు టీచర్లతో సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల…
Trinethram News : పట్టబద్రుల్లారా అభివృద్ధిని చూసి ఓటు వేయండి, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి సహకరించండి అని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం పిడింగొయ్యి గ్రామంలో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ నందు టీచర్లతో నిర్వహించిన సమావేశంలో గోరంట్ల పాల్గొన్నారు.
ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి రాక మునుపు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థులను ఘనవిజయం సాధించే విధంగా పట్టబద్రులు కృషి చేశారని, అదే స్ఫూర్తితో ఈ నెల 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బిజెపి బలపరిచిన కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని, పట్టభద్రుల తరపున సమస్యల పరిష్కారానికి పేరాబత్తుల రాజశేఖర్ ను శాసన మండలికి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్, ఫ్యూచర్ కిడ్స్ చైర్మన్ యేలేటి రవిబాబు, మట్ట శ్రీనివాస్, ముప్పిడి రాంబాబు, కోరాడ వెంకటేష్, మరకుర్తి వెంకటేశ్వరరావు, చిచ్చారి సుబ్బారావు, బత్తుల శివ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
