TRINETHRAM NEWS

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఉన్నటువంటి 2.5 లక్షల గ్రామ వాలంటీర్లకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

ప్రతీ సంవత్సరం వాలంటీర్లుకు ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఇస్తున్నటువంటి సేవా పరిష్కారాలకు సంబంధించిన అమౌంట్ ను రెట్టింపు చేయబోతున్నారని సమాచారం.

ప్రతీ సంవత్సరం సేవా పురస్కారాల కోసం 250 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఈ సారి రెట్టింపు చేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

ఈ సేవా పురస్కారాలు మూడు కేటగిరీ కింద ఇస్తున్నారు.. అందులో

1) సేవా వజ్ర – 30000
ఈ సారి రెట్టింపు చేసి 60000

2) సేవా రత్న – 20000
ఈ సారి రెట్టింపు చేసి 40000

3) సేవా మిత్ర – 10000
ఈ సారి రెట్టింపు చేసి 20000.

ఈ సారి 2024 సేవా పురస్కారాలు ప్రకటన ఫిబ్రవరి 15, 16 తేదీల్లో ఉండవచ్చు. మొత్తానికి మార్చి నెలలోపు ఈ సేవ పురస్కారాలు రెట్టింపు చేసి ఇవ్వటం ఖాయం అంటున్నారు.