TRINETHRAM NEWS

లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్.. వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ

Trinethram News : ముంబై: ఆర్బీఐ శుభవార్త తెలిపింది. కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వడ్డీరేట్లను సవరించడంతో లోన్లు తీసుకున్న వారికి ఉపశమనం కలగనుంది. ఈ మేరకు ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. వడ్డీ రేట్లు తగ్గడంతో దేశంలోని కోట్లాది మంది గృహ రుణ కొనుగోలుదారులకు భారీ ఊరట లభించనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు.

రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించినట్లు సంజయ్ మల్హోత్రా తెలిపారు. 6.50 శాతం ఉన్న రెపో రేటును 6.25 శాతానికి తగ్గించామన్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి సమావేశంలోనే వడ్డీ రేట్లను తగ్గించడం గమనార్హం. గడిచిన ఐదేళ్లలో తొలిసారి రెపో రేటును తగ్గించడంతో సామాన్య ప్రజలకు ఊరట కలిగింది. మే 2023 తర్వాత నుంచి కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది.

లోన్లపై ఈఎంఐ తగ్గించాలనే డిమాండ్ ఎంతోకాలంగా ఉంది. ఆర్‌బీఐ ఎంపీసీపై కూడా చాలా ఒత్తిడి ఉంది. గత కొన్ని సమావేశాల్లో ఎంపీసీలోని కొందరు సభ్యులు రెపో రేట్ల తగ్గింపును సమర్థించారు. కానీ ఎక్కువ మంది సభ్యులు మాత్రం రెపో రేటును మార్చకుండా అలాగే ఉంచాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా వడ్డీ రేట్లు తగ్గించాలని ఆర్బీఐపై ఒత్తిడి పెంచింది. అయితే సంజయ్ మల్హోత్రా ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెపో రేటులో సవరణలు చేస్తారని చాలామంది భావించినట్లుగానే ఈ నిర్ణయం తీసుకున్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

RBI reduced interest