TRINETHRAM NEWS

కోదండ రామాలయం ఛైర్మెన్ గట్ల రమేష్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు, మంత్రివర్యులు దుద్ధిల్ల శ్రీధర్ బాబు సహకారంతో ఈరోజు మధ్యాహ్నం కోదండ రామాలయం ఆవరణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ శ్రీ కోదండ రామాలయం ఛైర్మెన్ గా గట్ల రమేష్ మరియు కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు
ఈ సందర్బంగా రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ చైర్మన్ గట్ల రమేష్, మరియు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు అనంతరం గోదావరిఖనిలో శ్రీరామనవమి ఏర్పాట్లపై విలేకరుల సమావేశం నిర్వహించిన కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్
గోదావరిఖని శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గోదావరిఖనిలోని కోదండ రామాలయం పాలక మండలి భారీ ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గట్ల రమేష్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ఉత్సవాల ఏర్పాట్లపై వివరాలు తెలియజేశారు గత సంవత్సరాల కంటే ఈసారి ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా మండపాలు ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే రథోత్సవం, కళ్యాణ మహోత్సవం, అన్నదానం వంటి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు.
భక్తుల కోసం తాగునీరు, ప్రసాదాల పంపిణీ, విశ్రాంతి స్థలాలు ఏర్పాటు ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోలీస్ శాఖతో సమన్వయం వైద్యశిబిరం ఏర్పాటు చేసి భక్తులకు అత్యవసర వైద్య సహాయం అందించాలి స్వచ్ఛత, హైజీన్ పై ప్రత్యేక దృష్టి అధికారుల సమన్వయం ఈ ఉత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ, మునిసిపల్ అధికారులు, విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖలతో సమన్వయం జరిపి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని గట్ల రమేష్ తెలిపారు
ఈసారి భక్తుల కోసం ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలతో అలంకరించడంతో పాటు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు విదేశాల నుంచి కూడా భక్తులు తరలివచ్చే అవకాశముందని, వారి సౌకర్యాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపడతామని ఆయన తెలిపారు చైర్మన్ గట్ల రమేష్ సందేశం భక్తులందరూ పెద్ద ఎత్తున శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొని భగవంతుని ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాం. భక్తుల సహకారంతో ఈ ఉత్సవాలను సజావుగా నిర్వహిస్తాం” అని ఆయన పేర్కొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Godavarikhani Kodanda Rama Temple