
Trinethram News : ఒంగోలు 16-1-24
ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ. డైఫి. ఐద్వా కమిటీల ఆధ్వర్యంలో 24 వ డివిజన్ సమైక్యత నగర్ లో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవం సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా సంక్రాంతికి ఆటలు పోటీలు నిర్వహిస్తున్న డైఫీ ఐద్వా కమిటీల నిర్వాహకులను అభినందించారు. ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుంచే ఉన్నతమైన విలువలతో కూడిన జీవన ప్రమాణాలను తల్లిదండ్రులు చిన్నారులకు నేర్పినట్లైతే మనం ఆశించిన మెరుగైన సమాజం చూడవచ్చన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్. డాక్టర్ మొగిలి దేవా బహుమతులను అందజేశారు . ఈ కార్యక్రమంలో డైఫి నగర నాయకులు అవిషా హరీష్. కే శ్రీను. కోటమ్మ తదితరులు పాల్గొన్నారు.
