మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేసింది ప్రభుత్వం మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. అన్ని వయసుల మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటు, హైదరాబాద్‌లో నడిచే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. కాగా ఇప్పుడు మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్.ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో TSRTC కొత్తగా ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో ఎక్స్ ప్రెస్ నాన్ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మంగళవారం ఎన్టీఆర్ మార్గ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 25 బస్సులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సంవత్సరం ఆగస్టు వరకు మరో 500 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.ఈ మెట్రో ఎలక్ట్రిక్ బస్సులకూ మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం తెలిపింది.
మహిళలకు ఇకపై E బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం!
Related Posts
Cricket Tournament : క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన శ్రీను బాబు
TRINETHRAM NEWS క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన శ్రీను బాబు రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగిరి మండలంలోని రాణి రుద్రమదేవి స్టేడియంలో రామగిరి మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అజాతశత్రువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభావతి…
Kabaddi Court : కబడ్డీ కోర్టులో ఆ వ్యక్తి దహన సంస్కారాలు
TRINETHRAM NEWS కబడ్డీ కోర్టులో ఆ వ్యక్తి దహన సంస్కారాలు. Trinethram News : Telangana : కబడ్డీ అంటే అతనికి ఎంతో ఇష్టం. కబడ్డీ నేర్చుకొని ఎంతోమందికి దాన్ని నేర్పించిన వ్యక్తి. అతని వల్ల ఎంతోమంది కబడ్డీ క్రీడాకారులు అయ్యారు..…