Ap High court : ‘ఉచిత ఇసుక’ కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
అమరావతి: ఉచిత ఇసుక కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఉచిత ఇసుక విధానం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందనే ఆరోపణలతో చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే..
ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై సీఐడీ, చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో పిటిషన్‌పై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది..