TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్ మోహన్ దాస్ శ్రీ అనంత పద్మనాభ ఆర్ట్స్,సైన్స్ & కామర్స్ డిగ్రీ కాలేజ్ లో టెక్స్ అకాడమీ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ కోర్సులను అందించడానికి బి.ఎస్.సి,బి.కాం, బి.ఎస్.సి మైక్రోబయాలజీ విభాగాలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేసేందుకు ఉచిత ఆన్లైన్ స్కాలర్‌షిప్ పరీక్ష నిర్వహించింది. పరీక్షలో విజయం సాధించిన వారికి ఉచిత కంప్యూటర్ కోర్సులను అందించనున్నారు.అయితే ఈ సందర్భంగా ఉచిత ఆన్లైన్ పరీక్షను నిర్వహించినందుకు శ్రీ అనంత పద్మనాభ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా.

జె.మందారిక, టెక్స్ అకాడమీకి ధన్యవాదాలు తెలియ జేసారు ఉచిత కోర్సులకు ఎంపికైనందుకు బానోత్ కుమార్, మహ్మద్ అష్వాక్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా. శ్రీ అనంత పద్మనాభ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ కాలేజ్ కామర్స్ విభాగాధిపతి మణికంఠ రెడ్డి మాట్లాడుతూ… ఇలాంటి ఉచిత స్కాలర్‌షిప్ పరీక్ష, కోర్సులు, ప్లేస్మెంట్ అందించే డ్రైవ్లు విద్యార్థుల ప్రకాశవంతమైన కెరీర్కు ఖచ్చితంగా సహాయపడతాయని అన్నారు.

కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్ మోహన్ దాస్ ఉచిత స్కాలర్‌షిప్ పరీక్ష లో విజయం సాధించిన వారికి, కోర్సులు పూర్తయిన తర్వాత విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తామని, టెక్స్ అకాడమీ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఉద్యోగులుగా ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు జీవితంలో నిరంతర కృషి తపనతో ఎన్నో విజయాలు సాధించవచ్చన్నారు.కార్యక్రమంలో లెక్చరర్ బి. శ్రీనివాస్ చిర్గులపల్లి, నరేష్, వెంకటమ్మ, వైష్ణవి శ్రీ అనంత పద్మనాభ ఆర్ట్స్, సైన్స్ కామర్స్ కాలేజ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Free Computer