
అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండిస్తున్నాను: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ సరికాదు.
జాతీయ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి అల్లు అర్జున్.
ఆరోజు ప్రముఖులు VIP లు వస్తున్నారు కావున భద్రత పెంచమని థియేటర్ యాజమాన్యం లిఖిత పూర్వకంగా ప్రభుత్వాన్ని కోరిన సరే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు.
ప్రభుత్వం ప్రజల భద్రత గాలికొదిలేసి థియేటర్ దగ్గర ఎలాంటి భద్రత కల్పించకపోవడం వల్లే తొక్కిసలట జరిగి ఒక మహిళ ప్రాణం కోల్పోయింది.
ఈ చేతగాని ప్రభుత్వం ప్రతి విషయంలో విఫలం అవుతూ వస్తుంది.
ప్రజల భద్రత గాలికొదిలేసి ఆ తప్పిదాన్ని ప్రముఖల మీద రుద్ది అరెస్ట్ లకి పాల్పడటం సిగ్గు చెటు.
చట్టం ఎవరికీ చుట్టం కాదు ప్రజా పాలన అని చెప్పుకునే ఈ ప్రభుత్వానికి ప్రజల యొక్క సమస్యల పట్ల కనీస అవగాహన లేకపోవడంతో ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీస్కుని ఎంతో మంది ప్రాణాలు కోల్పోవటానికి కారణమైన ఈ రేవంత్ రెడ్డి ని మొదట అరెస్ట్ చెయ్యాలి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
