పెనుమూరులో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి
త్రినేత్రం న్యూస్. పెనుమూరు పెనుమూరు ఇంచార్జ్. జీడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం తెలుగుదేశం మండల అధ్యక్షుడు పెద్దినేని రుద్రయ్య నాయుడు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం వ్యవస్థాపకులు తెలుగు ప్రజల జీవనాడి అయిన దివంగత నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమమును ఉద్దేశించి రుద్రయ్య నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ పేదరిక నిర్మూలనకు బడుగు బలహీన వర్గాలకు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు. గురుకుల పాఠశాలలు స్థాపించారు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి తలారి రెడ్డప్ప మరియు నాయకులు గుర్రప్ప నాయుడు తెలుగుదేశం ముఖ్య నాయకులు ఎన్డీఏ కుటమి నాయకులు పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App