
త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. ఉభయ గోదావరి జిల్లాలు పచ్చని పంటలతో కళకళలాడే ప్రాంతాలు. అందులో అనపర్తి నియోజకవర్గం మూడు మండలాలు పూర్తిగా యేటా రెండు పంటలతో కళకళలాడే ప్రాంతం. వ్యాపార రంగం విస్తరించినా మెజారిటీ అనపర్తి నియోజకవర్గ ప్రజల జీవనాధారం వ్యవసాయం. అయితే గోదావరి నది నుండి కాలువల ద్వారా వచ్చే సాగునీటి వ్యవస్ధని గడచిన ఐదేళ్ళు వైయస్సార్ సిపి పాలకులు ఛిన్నాభిన్నం చేసేసారు. ధాన్యం కొనుగోలు అంశాన్ని నాటి వైకాపా ప్రభుత్వం ఒక ప్రహసనంగా మార్చేసింది
ప్రతిపక్షంలో ఉండగా సరిగ్గా ఇదే అంశంపై పలుమార్లు పోరాటం చేసారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పంటకాలువలలో, మురుగు కాలువల్లో తూడు తీయకపోవడంపైనా, కాలువలను అభివృద్ది చేయకపోవడం పైనా ఆయన తన సైన్యంతో కలసి పలుమార్లు ధర్నాలు, నిరసనలు చేసి ప్రభుత్వాన్ని మేల్కొలిపిన సంగతి అందరికీ విదితమే. సీఎంర్ కి ధాన్యం అమ్మిన రైతులకు సొమ్ములు చెల్లించడంలో నెలల తరబడి జరుగుతున్న జాప్యంపై కూడా రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాడారు ఆయన. నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారి దృష్టికి ఈ అంశాలు రావడంలో నల్లమిల్లి కృషి కీలకపాత్ర పోషించింది. ధాన్యానికి మద్దతు ధర రాకుండా జరిగిన గోల్ మాల్ పై తీవ్ర విమర్శలతో నాడు విరుచుపడ్డారు నల్లమిల్లి.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గెలిచిన కూటమి ప్రభుత్వం నాడు నల్లమిల్లి తమ దృష్టికి తీసుకువచ్చిన ఈ అంశాలపై దృష్టి సారించింది. అధికారం వచ్చిన వెంటనే పంటకాలువలు & డ్రైయిన్లలో తూడు తొలగింపుకి నిధులు మంజూరు చేసింది. అనపర్తి నియోజకవర్గంలో పలు కాలువలలో తూడు తొలగించడానికి ఉపాధి హామీ కూలీలను ఉపయోగించుకోవడం ద్వారా ప్రమాణ స్వీకారానికి ముందే నల్లమిల్లి తన కార్యాచరణ మొదలు పెట్టాడు.
మరోప్రక్క ధాన్యం కొనుగోలులో ఏదైతే డబ్బు చెల్లింపు ఆలస్యం అంశంలో నల్లమిల్లి పోరాడాడో దానిపైనా కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. 48 గంటలలో డబ్బు చెల్లించేలా జాగ్రత్తలు తీసుకుంది. గడచిన పంటకి సొమ్ములు 24 గంటలలోపుగానే రైతుల ఖాతాలో జమ కావడం జరిగింది కూడా.
ఇక ఎమ్మెల్యే గా భాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే నల్లమిల్లి అసెంబ్లీ సమావేశాలలో తరచుగా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా అందుకు స్పందిస్తూ పరిష్కారం దిశగా ప్రయత్నిస్తూ వస్తుంది. ముఖ్యంగా గోదావరి డెల్టా ఆధునీకరణ అంశం గురించి గడచిన రెండు సమావేశాలలోను నల్లమిల్లి సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. వైయస్సార్ సిపి హయాంలో డెల్టాలోని అన్ని నియోజకవర్గాలలోని పంట కాలువలు నిర్లక్ష్యానికి గురై సాగునీరు అందక, మురుగునీరు కదలక రైతులు పడుతున్న అవస్ధలపై నేడు ఆయన సభ దృష్టికి తీసుకువచ్చి కూటమి ప్రభుత్వం అలెర్ట్ కావడంలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు.
ఇక కాటన్ బ్యారేజ్ భద్రత అంశంపై ఆయన సమావేశాలలో సభ దృష్టికి తీసుకు వచ్చారు. బ్యారేజ్ గేట్లు మార్చవలసిన అవసరం గురించి లెక్కలతో సహా ఆయన సభలో వివరించారు. బ్యారేజ్ ని పరిరక్షించుకోకపోతే ప్రమాదం తప్పదని ఆయన వివరించారు. సెంట్రల్ వాటర్ కమీషన్ ఇచ్చిన నివేదికను నాటి వైసిపి ప్రభుత్వం తుంగలో త్రొక్కడంపై ఆయన ధ్వజమెత్తారు.
డెల్టా ఆధునీకరణ కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించవలసిందిగా సభలో కోరిన ఎమ్మెల్యే నల్లమిల్లి నేడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న కాలువల్లో తూడు తీయడం తదితర పనులలో కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్న తీరుపై తీసుకోవలసిన జాగ్రత్తలపై సభలో మాట్లాడారు.
ఇక ధాన్యానికి మద్దతు ధర పెంచాల్సిన అవసరం గురించి అలాగే ధాన్యం కొనుగోలులో జిల్లాల నిబంధనలో రైతులకు వెసులుబాటు కల్పించాల్సిన అవసరం గురించి సభ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకువచ్చారు ఎమ్మెల్యే నల్లమిల్లి. శాసనసభలో తనకు అవకాశం ఇచ్చిన ప్రతీ సందర్భంలోనూ ఆయన రైతాంగం సమస్యలపై గళమెత్తుతున్నారు. తద్వారా ప్రభుత్వం రైతుల సమస్యపై దృష్టి సారించేలా చేయగలుగుతున్నారు.
ఒక్క తన నియోజకవర్గ రైతులకే కాకుండా వ్యవసాయంపై ఆధారపడిన ప్రతీ నియోజకవర్గ రైతులు లబ్ది పొందేలా ఎమ్మెల్యే నల్లమిల్లి చేస్తున్న కృషి అభినందనీయం. రైతే రాజు అని నమ్మిన నిజమైన నాయకుడు నల్లమిల్లి
ప్రతిపక్షంలో ఉన్నపుడు సమస్యలపై ప్రశ్నించడం, విమర్శించడం, ధర్నాలు చేయడం కర్తవ్యం అయితే అధికారంలోకి వచ్చాక వదిలేయకుండా అదే సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయడం భాధ్యత. ఆ భాధ్యతను భుజాన వేసుకున్న ఎమ్మెల్యే,నల్లమిల్లి అభినందనీయుడు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
