
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 21 :- జర్నలిస్ట్ నరేష్ కుటుంబానికి కూకట్ పల్లి జర్నలిస్ట్లు సుమారు లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం చేయడం అభినందనీయం అని టి యు డబ్ల్యు జే రాష్ట్ర కోశాధికారి ఆస్కాని మారుతి సాగర్, టి యు డబ్ల్యు జే – ఐజేయు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం కూకట్ పల్లి సర్కిల్ హైదర్ నగర్ డివిషన్ భాగ్యనగర్ కాలనీ ప్రాంతంలోని సాయిబాబా గుడి ఆలయం ఆవరణలో కూకట్ పల్లి నియోజకవర్గ విలేకరి నరేష్ కుటుంబానికి కూకట్ పల్లి జర్నలిస్ట్ ఆధ్వర్యంలో సుమారు లక్ష పదమూడు వేల రూపాయలు నరేష్ తల్లికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు జర్నలిస్ట్ కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఛైర్మన్ అల్లం నారాయణ సారథ్యంలో నరేష్ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం, వారి పిల్లలకు ఉచిత విద్య, వారి తల్లిదండ్రులకు నెలకు 3 వేల రూపాయలు పింఛన్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
జర్నలిస్ట్ ఆరోగ్య పరమైన అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి టి యు డబ్ల్యు జే – ఐజేయు ప్రెసిడెంట్ భూమి శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు దామోదర్ రెడ్డి, లక్ష్మణ్ ప్రసాద్, నర్సింహ, టి యు డబ్ల్యు జే కూకట్ పల్లి ప్రధాన కార్యదర్శి ఎర్ర యాకయ్య, టి యు డబ్ల్యు జే – ఐజేయు కోశాధికారి నమాల శ్రీధర్, కూకట్ పల్లి ఉపాధ్యక్షుడు వేణు, నాగరాజు పంతులు, సీనియర్ జర్నలిస్ట్లు జైపాల్, ఈనాడు ఈశ్వర్, మల్లేష్, జర్నలిస్ట్లు మాణిక్య రెడ్డి, శశిధర్, నూతలపాటి శ్రీనివాస్, శివ, రాహుల్ ప్రదీప్, క్రాంతి కుమార్, శ్యామ్ కుమార్, భూమి పరుశురాం, రంజిత్ కుమార్, రామారావు, శ్రీనివాస్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, లోకల్ శ్రీనివాస్ రెడ్డి, నాగార్జున, లక్ష్మణ్, ఆనంద్ రావు, శ్రీరామ్, అరుణ్, ఫోటోగ్రాఫర్ శ్రావణ్, సురేశ్, ధనాంజాయ్ చారి, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
