Filling teacher posts without SC classification is a betrayal of Madigalas
Trinethram News : వికారాబాద్ జిల్లా అక్టోబర్ 5 త్రినేత్రం న్యూస్ :
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పై అసంబ్లి సాక్షిగా రేవంత్ రెడ్డి మాటిచ్చి మాదిగలకు చేసిన మోసాన్ని నిరసిస్తూ ఈ నెల 9న వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శన మాదిగల భవిషత్తు తో చెలగాటమా రేవంత్ రెడ్డి
మాదిగల సత్తా ఏంటో రేవంత్ రెడ్డి కి చూపిస్తాం ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షుడు పీ.ఆనంద్ మాదిగ.. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ మాదిగ
వివరణ :- సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించి ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి 11062 టీచర్ పోస్టులను ఎస్సీ వర్గీకరణ లేకుండా అమలు చేయడం మాదిగ జాతికి నమ్మిక ద్రోహం చేయడమే అవుతుందని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల వికారాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు పి ఆనంద్ మాదిగ మాట్లాడుతూ ” మాదిగల పట్ల రేవంత్ రెడ్డి వైఖరి నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్లు ఉందని అన్నారు ఎన్నో త్యాగాలు చేసి ముప్పై ఏళ్ళ పోరాటం ద్వారా సుప్రీం కోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణను సాధించుకుంటే ఆ ఫలాలు మాదిగలకు అందకుండా రేవంత్ రెడ్డి కుట్ర చేయడం దారుణమని అన్నారు.మాల నాయకుల బ్లాక్ మెయిల్ కు రేవంత్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు .ఇంత అత్యవసరంగా టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ లోని మాల నాయకుల ఒత్తిడి మేరకు ఎస్సీ టీచర్ పోస్టులన్ని మాలలకు దోచిపెట్టడానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడని అన్నారు. దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కె.మల్లికార్జున్ మాదిగ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని ఎదుర్కోవడానికి మాదిగ విద్యార్థులు , నిరుద్యోగులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి ఉద్యమంలో భాగస్వాములు కావాలని అన్నారు.రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 9 న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అంబేద్కర్ విగ్రహల వద్ద నుండి కలెక్టర్ కార్యాలయాల వరకు నల్ల జెండాలతో భారీ ప్రదర్శనలు చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు అక్టోబర్ 9న వికారాబాద్ జిల్లా కేంద్రంలో నల్ల జెండాల ప్రదర్శన నిర్వహించనున్నామని ఈ కార్యక్రమానికి మాదిగ నిరుద్యోగులు విద్యార్థులు ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఎం ఎస్ పి జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామిధాస్ మాదిగ , జిల్లా ఉప అధ్యక్షుడు జింగుర్తి నర్సింలు మాదిగ, అల్లాపూర్ కృష్ణ మాదిగ. జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ మాదిగ, ఎం ఎస్ పి జిల్లా సీనియర్ నాయకులు జి.రవి కుమార్ మాదిగ, ఎం ఎస్ ఎఫ్ జిల్లా కన్వీనర్ శివాజీ మాదిగ. ఎం ఎస్ పి జిల్లా కార్యదర్శి మహేందర్ మాదిగ, కో కన్వీనర్ ఉమ శంకర్ మాదిగ, కిష్టన్న మాదిగ, నర్సింలు మాదిగ,శ్రీశైలం మాదిగ, సుధాకర్ మాదిగ, అనంతయ్య మాదిగ, మహిళ నాయకురాలు పుష్ప రాణి, రాయప్ప మాదిగ, ఇస్సాకు మాదిగ, బన్నీ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App