Festivals : శాంతియుత వాతావరణం లో పండుగలు జరుపుకోవాలి

TRINETHRAM NEWS

Festivals should be celebrated in a peaceful atmosphere

రామగుండం పోలీస్ కమిషనరేట్

శాంతియుత వాతావరణం లో పండుగలు జరుపుకోవాలి.

మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలి.

సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలపై స్పందించవద్దు

వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్.,

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మతసామరస్యం సోదర భావంతో పండుగల జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,ఐజి అన్నారు. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ క్వార్టర్స్ లో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపెల్లి మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్థి, మిలాద్- ఉన్- నబీ ల పండుగ ల దృష్ట్యా శాంతి సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రతి పండుగ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని సదుద్దేశంతో అన్ని మతాల పెద్దలతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.

గత సంవత్సరం రామగుండం కమిషనరేట్ పరిధిలో 4253 లో మంచిర్యాల జోన్ పరిధిలో -1981, పెద్దపెల్లి జోన్ పరిధిలో 2272 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం వినాయక విగ్రహాల ఏర్పాటు పెరిగే అవకాశం ఉందన్నారు.

వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారు అన్ని వివరాలతో సంబంధిత పోలీస్ స్టేషన్లో సంప్రదించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. నమోదు చేసుకున్న వాటి వివరాల ఆధారంగా ఆన్లైన్ చేయడం విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేయడం చేస్తామని, నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా శోభయత్ర సాఫీగా సాగేలా రూట్ మ్యాప్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తామన్నారు.

గణేష్ మండపాల వద్ద నిర్మాణ కమిటీలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి నిరంతర నిఘా ఉంటుంది, విద్యుత్ షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాఫిక్ కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు.

24*7 నిరంతరం ప్రతి విగ్రహం వద్ద ఇద్దరు తప్పనిసరిగా ఉండాలి. పాయింట్ బుక్ ఏర్పాటు చేస్తాం, బ్లూ క్లోట్స్, పెట్రో కార్ వారు చెక్ చేయడం జరుగుతుంది అన్నారు.

తప్పనిసరిగా విద్యుత్ శాఖ వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి, అనుమతి లేకుండా మండపాలకు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయకూడదు.

విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల చుట్టూ ప్రక్కల నిమజ్జనం వెళ్లే దారులలో ఎలాంటి ఇబ్బందులు కలగాకుండా ఉండేలాగా ముందుగానే చూసుకోవాలి

కొంతమంది సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు పుకార్లు ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెట్టే అవకాశం ఉందని ప్రజలు వాటి పోస్టులను చూసి సంయమనం పాటించాలని, నిజామా ,అబద్దమా అని స్థానిక పోలీస్ వారిని అడిగి తెలుకోవాలని అన్నారు. ఏలాంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే డయాల్ 100, కమీషనరేట్ కంట్రోల్ రూం 8712656597 కానీ లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు.

సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు చేసి మత ఘర్షణలు జరిగేలాగా లా అండ్ ఆర్డర్ సమస్య కు కారణం అయితే అట్టి వారి ఫై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని సీపీ హెచ్చరించారు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని మతాలకు సంబంధించిన సమస్య ఆత్మక ప్రాంతాలను గుర్తించి నిరంతరం నిఘా ఉంచి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను సంతోషంగా జరుపుకునేలా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సిపి గారు అధికారులను ఆదేశించారు.

గణేష్ నిమజ్జనంతో పాటు, మిలన్ -ఉన్ -నబి పండుగలు రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు సూచించిన నిబంధనలు కచ్చితంగా పాటించాలని శోభాయాత్ర సమయంలో పోలీస్ శాఖ రోడ్ మ్యాప్ ను అనుసరించాలని పోలీస్ వారికీ శాంతి కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు.

ఈ సమావేశంలో పెద్దపల్లి డిసిపి చేతన ఐపిఎస్ మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్., అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్ర రావు, గోదావరిఖని ఏసిపి ఎమ్ రమేష్ పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ, మంచిర్యాల ఎసిపి ఆర్ ప్రకాష్ జైపూర్ ఏసిపి ఏ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, టాస్క్ ఫోర్స్ ఏసిపి మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, సి సి ఎస్ ఏ సి పి వెంకటస్వామి, ఏ ఆర్ ఏసి పి ప్రతాప్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిఐలు ఇన్స్పెక్టర్లు, పీస్ కమిటీ సభ్యులు, అన్ని మతల పెద్దలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Festivals should be celebrated in a peaceful atmosphere

You cannot copy content of this page

Scroll to Top