
జీడి నెల్లూరు పెనుమూరు త్రినేత్రం న్యూస్. గంగాధర నెల్లూరు నియోజకవర్గo పెనుమూరు మండలం తానా వేణుగోపాలపురం గ్రామానికి చెందిన రైతు సుబ్రహ్మణ్యం తన భూ సమస్య పరిష్కరించాలని విద్యుత్ ఎవరు ఎక్కాడు. తన భూమిని సదరు గ్రామానికి చెందిన మరొక వ్యక్తి అక్రమంగా ఆక్రమించుకున్నాడని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన అధికారులు తనకు న్యాయం చేయలేదని విద్యుత్ టవర్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న పెనుమూరు పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా టవర్ నుంచి దిగి రాలేదు.
నాకు న్యాయం జరిగే వరకూ దిగి రానని తగేసి చెప్పాడు. ఈ విషయం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలియజేయడంతో ఆయన అధికారులను అప్రమత్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా రైతుతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. రైతు వెంటనే టవర్ దిగాడు. అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
