Extensive checks by police at Manchiryala and Bellampally railway stations
మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
నేరాలు నియంత్రణ, గంజాయి అక్రమ రవాణా, వినియోగం నియంత్రణ ముందస్తు చర్యల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్., (ఐజి), మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఆదేశాల మేరకు మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ పర్యవేక్షణ లో మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో యువత, ప్రజల ఆరోగ్యం ప్రాణాలకు హాని కలిగించే గంజాయి, మాదకద్రవ్యాల వంటి వాటిని అరికట్టడం, రవాణా, నియంత్రణ లో భాగంగా మంచిర్యాల పట్టణ ఎస్ఐ, సిబ్బంది, నార్కోటిక్ ట్రయినింగ్ స్నిఫర్ డాగ్ , స్పెషల్ పార్టీ సిబ్బంది తో ముమ్మరంగా రైల్వేస్టేషన్ పరిసరప్రాంతాలు, పార్సెల్ సర్వీస్ కేంద్రాలు, మహారాష్ట్ర వైపు నుండి వచ్చే ప్రయాణికులు ప్రయాణించే రైల్వే బోగీలను, అనుమానాస్పదంగా కనిపించే ప్రతి పార్సిల్, రవాణా బ్యాగులను, ప్రయాణికుల బ్యాగ్ లను తనిఖీ చేయడం జరిగింది.
గంజాయి, డ్రగ్స్, ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తుల రవాణాన, నియంత్రణ లో భాగంగా ఈ రోజు బెల్లంపల్లి, మంచిర్యాల రైల్వే స్టేషన్ లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. మాధకద్రవ్యాలు రవాణా, విక్రయాలు, గంజాయి పంటలు సాగు చేసిన వారిని గుర్తించి కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం మరియు ఇప్పటికే విక్రయదారులపై సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. వారిపై ప్రత్యేక నిరంతరం నిఘా ఉంటుందని, మంచిర్యాల జిల్లాకు మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుండి గంజాయి రవాణా రైల్వే మార్గం ద్వారా చేసే అవకాశం ఉన్నందున ఈ ఆకస్మికంగావిస్తృతంగా తనిఖీలు చేపట్టడం జరుగుతుంది అని సీఐ తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App