TRINETHRAM NEWS

Trinethram News : రాష్ట్రంలో నేటి నుంచి 1-9 తరగతుల వార్షిక పరీక్షలు (సమ్మే టివ్ అసెస్మెంట్-2) ప్రారంభం కానున్నాయి. ఈనెల 17 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. 1-8వ తరగతి వరకు ఉదయం 9-12 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9-12.15 గంటల వరకు పరీక్షలుంటాయి.

షెడ్యూల్ ఇదీ..

ఉన్నత తరగతులకు (6-9) ఏప్రిల్ 7న ఫస్ట్ లాంగ్వేజ్, 8న సెకండ్ లాంగ్వేజ్, 9న థర్డ్ లాంగ్వేజ్, 10న గణితం, 11న జనరల్ సైన్స్/ ఫిజికల్ సైన్స్, 12న బయాలజీ, 15న సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయి. 16న కాంపోజిట్ కోర్సు లైన సంస్కృతం/ హిందీ, అరబిక్, పర్షియా లేదా ఓఎస్ఎస్సీ పేపర్-1, 17న ఓఎస్ఎస్సీ లేదా కాంపోజిట్ కోర్సు పేపర్-2 పరీక్ష ఉంటుంది.

ప్రాథమిక తరగతులకు (1-5) ఏప్రిల్ 9న ఫస్ట్ లాంగ్వేజ్, 10న ఇంగ్లిష్, 11న గణితం, 12న ఈవీఎస్ (3, 4, 5 తరగతులు), 15న ఓఎస్ఎస్సీ (3, 4, 5 తరగతులు) పరీక్షలు జరుగుతాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Exams for classes 1-9