ఢిల్లీ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం
ఢిల్లీ లో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన రెండు రోజుల పాటు జరగనున్నాయి. జనవరి 29న రీట్రీట్ వేడుకతో ముగుస్తాయి.
ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ భద్రతకు 14 వేల మందితో భారీ భద్రత
ఈ ఏడాది కవాతును వీక్షించేందుకు 77,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు
ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఈ సారి 2024 రిపబ్లిక్ డే థీమ్
“ఇండియా – మదర్ ఆఫ్ డెమోక్రసీ”, “వీక్షిత్ భారత్”( అభివృద్ది చెందిన భారత దేశం అని అర్థం)
2024 భారత రిపబ్లిక్ డే వేడుకలకు గౌరవ అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మాక్రాన్ కు ఆహ్వానం అందింది. దేశ రాజధానిలో రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ నాయకుడు ముఖ్య అతిథిగా రావటం ఇది ఆరవసారి.