TRINETHRAM NEWS

ప్రతి ఒక్కరూ రేణుక ఎల్లమ్మ తల్లి అనుగ్రహం పొందాలి
దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంద
-ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి
-బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

ప్రతి ఒక్కరూ రేణుక ఎల్లమ్మ తల్లి అనుగ్రహం పొందాలి అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.ఆదివారం కొండమల్లెపల్లి మండల కేంద్రంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం మూడో వార్షికోత్సవం సందర్భంగా రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మాజీ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…..దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని అయన తెలిపారు.ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని అయన అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారిని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కేసాని లింగారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు రమావత్ తులిసిరము, మాజీ వార్డు సభ్యులు సత్యం, వడ్త్యా బాలు, జోహార్ లాల్,వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

grace of Mother Renuka Ellamma