TRINETHRAM NEWS

దివ్యాంగులకు చేయూతనీయటంలో అందరూ సహకరించాలని దివ్యాంగులను కూడా సాధారణ వ్యక్తులుగా పరిగణించి వారికి ఆత్మస్థైర్యాన్ని పెంచాలని తద్వారా వారు కూడా సమాజంలో రాణించగలుగుతారని, 15 సంవత్సరాలలోపు దివ్యాంగులైన చిన్నారులకు వైరాలో భవిత కేంద్రం నందు ప్రత్యేక శిక్షణ ద్వారా వారిని సామాన్యులు గా తీర్చిదిద్దుతున్నారని బాధితులు కేంద్రాన్ని వినియోగించుకోవాలని లయన్స్ క్లబ్ వైరా అధ్యక్షులు పెనుగొండ ఉపేంద్ర రావు అన్నారు. తాటిపూడి గ్రామం నందు దివ్యంగుడైన ఆవల బచ్చయ్య కుమారుడు రామారావు కు క్లబ్ సభ్యురాలు అయిన పదిమల పుష్పలత గారి పుట్టినరోజు సందర్భంగా వీల్ చైర్ను అందిస్తూ ఆయన మాట్లాడినారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పెనుగొండ ఉపేంద్రరావు కార్యదర్శి అబ్బూరి రమేష్, ఎం.పీ.టీ.సీ అల్లిక కాటమరాజు, స్వచ్ఛంద సేవకురాలు తాత నిర్మల, కట్ల సురేష్, వైరా మండల ఐ .ఈ .డి ఉపాధ్యాయులు తాళ్లూరి రవికుమార్, సతీష్ ,శ్రీరామ్, కవిత నాగరాజు తదితరులు పాల్గొన్నారు