TRINETHRAM NEWS

తేదీ : 18/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజవర్గం, ఏ కొండూరు మండలం, కొత్త రేపూడి గ్రామం ఉద్యాన వ్యవసాయ విభాగం అసిస్టెంట్ భూక్య . మంగమ్మ మాట్లాడుతూ ఉద్యాన కృషి అనేది వ్యవసాయ శాస్త్రం యొక్క ఒక ప్రత్యేక విభాగం అనడం జరిగింది. పూలు, పండ్లు, కూరగాయలు సాగు ముఖ్యమైనవి అని చెప్పారు.
ప్రతి రైతు దుక్కి దున్నడం దగ్గర నుంచి పండించిన పంటను అమ్ముకునే వరకు అనేక నిర్వహణ కార్యక్రమాలు ఉంటాయని తెలపడం జరిగింది. ప్రతి రైతు తప్పనిసరిగా రైతు సేవా కేంద్రంలో ఫార్మర్ రిజిస్టర్ చేయించుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ వారు కోరడం జరిగింది అని తెలిపారు.
రిజిస్టర్ చేయించుకున్న రైతుకు, రైతు వారి అందించే ప్రతి ఒక్క బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి అన్నదాత సుఖీభవ, పంట బీమా , ప్రభుత్వం అందించే వ్యవసాయ సాంకేతిక పరికరాలు సబ్సిడీకి ఇవ్వడం. పచ్చి రొట్టెల ఎరువులు ఇవి అందించడం జరుగుతుంది. అని చెప్పారు. కావలసిన పత్రాలు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ /ఆధార్ లింక్ అయినా ఫోను భూమి పట్టాదార్ పాస్ బుక్ /1B అని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Registration is required