
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం, యు. చీడిపాలెం పంచాయతీ, కంటవరం గ్రామస్తులు. మాగ్రామంలో 25 కుటుంబాలు ఉన్నాయి.
రోడ్డు, మంచినీటి సౌకర్యం లేక, కొండ వాగు ఊట నీరు తాగే దుస్థితి. మరియు రేవులకోట గ్రామం నుండి మా కంటవరం గ్రామానికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు కాలినడకన, నడవటానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. మా గ్రామం లో ఉన్న ప్రజలకు ఏమైనా అనారోగ్యం కారణంగా లేక, గర్భిణీ స్త్రీలకు హాస్పిటల్ కి తీసుకొని వెళ్లాలన్న నేటికి డోలుమూతలే, మరియు కొండవాగు, నీళ్లు తాగటం వల్ల తరచూ అనారోగ్యాలు బారిన పడాల్సి వస్తుంది.
కావున అధికారులు స్పందించి రేవుల కోట నుంచి మా గ్రామానికి రోడ్డు మరియు త్రాగు నీరు కొళాయిలు మంజూరు చేస్తారని, ప్రాదేయపడుతున్నాము. అధికారులు మారిన, ప్రభుత్వాలు మారిన మారని తలరాతలు మావి. ఇలా మా కష్టాలు చెప్పుకొని పోతే ఏ అధికారులు ,,ఏ నాయకులు ఇప్పుడు వరకు కంటవరం గ్రామము ఎక్కడ ఉందో వాళ్ళకే తెలియదు గవర్నమెంట్ దృష్టిలోమా గ్రామం అంటే గుర్తింపు లేకుండా పోయింది. ఎప్పుడు మా తలరాతలు మారుతాయి. ఎప్పుడూ మాకు రోడ్డు సదుపాయం కలిగిస్తారు. ఎప్పుడూ మంచి నీటి సదుపాయం అందిస్తారు. అని కంఠవరము పి.వి.టి.జి గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా సమస్యలను వెంటనే పరిష్కరించగలరని మీడియా ముందు,తమ కష్టాలను ప్రభుత్వాన్ని, తెలియ పరిచారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
