TRINETHRAM NEWS

Even if the Congress party has given false assurances, it is the tear in the eyes of the farmers during the Congress rule

రైతుల బుణమాఫీపై ప్రభుత్వం ద్వంద వైఖరి

తెలంగాణ రైతంగాన్ని కంటికి రెప్పాలగా కపాడింది తొలి సిఎం కేసీఆర్‌

దేశం గర్వించేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం
“మేము సైతం కేటీఆర్ అన్న బాటలో” వాల్ పోస్టరు ఆవిష్కరణ

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీ.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్
రైతు రుణమాఫీ పై కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంబిస్తుందని, మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ పై అనేక ఆంక్షలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు.

అదివార్ గోదావరిఖని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతాంగం కళ్లల్లో ‌‌‍అనందం నిండిందని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి పాలనలో రైతుల కళ్లల్లో కన్నీలు మిగిలాయాన్నారు. కేసీఆర్‌ పాలనలో ఇంటింటికి సంక్షేమ పధకాలను విజయవంతంగా అందించి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ పాలన ఒక దిక్సూచి గా నిలిచిందన్నారు. కేసీఆర్‌ పాలనకు నితిఆయెాగ్ అభినందించిందని గుర్తు చేసారు. కేసీఆర్‌ చెప్పిన విధంగా ఏకకాలంలో రుణమాఫీ చేసిందన్నారు.

గోదావరి దిశను మార్చి తెలంగాణ ప్రజల దశ మార్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. ప్రపంచం అబ్బరపడే విధంగా
కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసారన్నారు. కాంట్రాక్టు నిర్లక్ష్యం కారణంగా మూడు పిల్లర్లు కుంగితే ఆ అపవాదును కేసీఆర్‌ మీద మెాపి కాంగ్రెస్ పార్టి లబ్ధిపోందే ప్రయాత్నాలు చేసిందన్నారు. కేసీఆర్‌
పై తప్పుడు మాటలు మాట్లాడిన నాయకులకు మేడిగడ్డలో ప్రవహించే గోదావరి నీరే నిదర్శనం అన్నారు. రైతు రుణమాఫీ పై ముఖ్యమంత్రి ఒకరకంగా మంత్రులు ఒకరకంగా మాట్లాడుతూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని, సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ కేంద్రాలకు నిలయంగా ఉన్న రామగుండం ప్రాంతంలో జెన్ కో ద్వారానే విద్యుత్ కేంద్రాలను ఎర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నరని అన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి సంస్ద కొత్త వ్యాపారానికి తేరలేపిందని, షాంపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాల పేరుతో క్వార్టర్ లు తోలగించిలాని చూస్తందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు రైతులకు ఇచ్చిన హామిలు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్‌ విడుదల చేయాలన్నారు.

రైతు లకు రుణమాఫీ, రైతు భరోసా పంటకు 500 రూపాయలు బోనోస్ అమలు చేయాలని డిమాండ్ చేసారు. అనంతరం పెదవారి ముఖంలో అనందం కోసం “మేము సైతం కేటీఆర్ అన్న బాటలో” వాల్ పోస్టరు ఆయన ఆవిష్కరించారు.మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా రామగుండం నియోజకవర్గం ప్రతిడివిజన్లో గ్రామంలో గిప్ట్ ఏ స్మైల్ సేవ కార్యక్రమాలు చెపడుతున్నామని తెలిపారు.

ఈ విలేఖరుల సమావేశం లో కార్పోరేటర్ గాధం విజయనాయకులు నడిపెల్లి మురళీధర్ రావు అచ్చే వేణు చల్లగురుగుల మెగిళి పిల్లి రమేష్ నూతి తిరుపతి జహిద్ పాషా బోడ్డుపల్లి శ్రీనివాస్ చల్లా రవీందర్ రెడ్డి ఆడప శ్రీనివాస్ తోకల రమేష్ ఓదేలు గుంపుల లక్ష్మి తాళ్ల శ్యాం చింటూ బచ్చాల రాములు ముద్దసాని సంధ్యారెడ్డి సట్టు శ్రీనివాస్ యువరాజ్ కనకరాజ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Even if the Congress party has given false assurances, it is the tear in the eyes of the farmers during the Congress rule