
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 31 : రంజాన్ పండుగ హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక అని కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న అన్నారు. సోమవారం కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు చున్ను భాష ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు యాకన్న తోపాటు జర్నలిస్టులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పండుగ ముస్లిం సోదరీ సోదరులు అత్యంత పవిత్రంగా చేసుకునే పండుగ, హిందువులు ముస్లింలు ఐక్యతగా కలిసిమెలిసి ఉంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ బైరాగి, తెలంగాణ కేబుల్ చానల్స్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆనందరావు, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ సలహాదారులు కిషోర్ చారి, కోశాధికారి పుట్టి నాగేష్, జాయింట్ సెక్రెటరీ సుజాత, సభ్యులు హేమంత్ సాగర్, ప్రభాకర్ రెడ్డి, వినీల్ గౌడ్, కరుణ కుమార్, మహేష్ చారి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
