Eravelli Mutyam Rao is the district secretary of CITU
సామాజిక అణిచివేతను ప్రతిఘటించాలి
ఎరవెల్లి ముత్యంరావు సిఐటియు జిల్లా కార్యదర్శి.
సామాజిక ఉద్యమ సంఘీభావ నిధిని
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు సిఐటియు జిల్లా నాయకులు గోదావరిఖని ఆఫీసులో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ జిల్లా కమిటీకి అందజేశారు, ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ భారతదేశంలో వర్గ పోరాటాన్ని ఆటంక పరుస్తున్న సామాజిక సమస్యలపై సిఐటియు పోరాడుతుందని అన్నారు, సామాజిక అణిచివేత, కుల వివక్షకు వ్యతిరేకంగా కెవిపిఎస్ రాజీలేని సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని, అలాంటి సామాజిక ఉద్యమ పోరాటాలను పరచవలసిన బాధ్యత కార్మిక వర్గానికి ఉందని, అందుకే సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని కార్మికులనుండి 26 వేల రూపాయలు, సామాజిక ఉద్యమ సంఘీభావ నిధిని సేకరించామని, దాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ జిల్లా కమిటీకి ఈరోజు అందజేయడం జరిగిందని, హితోదికంగా సామాజిక ఉద్యమ సంఘీభావ నిధి ఇచ్చిన జిల్లాలోని కార్మికులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని,ఇలాంటి సంఘీభావ ఉద్యమాలకు కార్మిక వర్గం ఎల్లవేళలా అండగా ఉండాలని, తద్వారా వర్గ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని అన్నారు. కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్ మాట్లాడుతూ సామాజిక ఉద్యమ నిధి అందించిన జిల్లాలోని కార్మికులకు, సిఐటియుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, ఇది మాపై మరింత బాధ్యతను పెంచుతుందని, సిఐటియు ఆశించిన విధంగా సామాజిక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మెండే శ్రీనివాస్, ఎన్, బిక్షపతి, సహాయ కార్యదర్శి జి, జ్యోతి,నాయకులు సిపెల్లి రవీందర్, రాజమౌళి,సురేష్, శ్రీనివాస్,రవి,శివరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App