TRINETHRAM NEWS

అరుకు రైల్వే స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయండి (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు డిమాండ్.

ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకులోయ )టౌన్ త్రినేత్రం న్యూస్ డిసెంబర్.08:

అరుకు రైల్వే స్టేషన్ పరిధిలో పని చేస్తున్న రన్నింగ్ రూమ్ కార్మికులు, స్లిప్పర్స్, గెస్ట్ హౌస్ లో పనిచేస్తున్న కార్మికులు, రైల్వే ట్రాకర్లు లో పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం కనీస వేతనం 26000 చెల్లించాలని సిఐటియు అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది ఈ మేరకు శనివారం అరకు రైల్వే స్టేషన్ రన్నింగ్ రూమ్ అధికారికి రైల్వే కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు) అనుబంధం ఆధ్వర్యంలో డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులకు రైల్వే కాంట్రాక్టర్లు చట్ట ప్రకారం జీతాలు చెల్లించకుండా కార్మికులకు రైల్వే బోర్డు ఇస్తున్న వేతనంలో కోత విధిస్తున్నారని తెలిపారు అదే విధంగా పిఎఫ్, ఈఎస్ఐ పేరుతో జీతాల్లో పాత విధిస్తున్న కొంతమంది కార్మికులకి ఖాతాల్లో చేరడం లేదని అన్నారు. తక్షణం సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేశారు సోమవారం విశాఖ డిఆర్ఎం కి కాంట్రాక్టర్ పై ఫిర్యాదు చేస్తున్నట్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App