Trinethram News : ఈ రోజు నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సర్దుబాటు కార్య క్రమం ప్రారంభిస్తారు.
ప్రతీ గ్రామ, వార్డ్ సచివాలయాల్లో 8 మంది తప్పనిసరిగా వుండేటట్లు చేస్తున్నారు.
ఈ నెల 27, 28,29 తేదీల్లో సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 వేల మంది సచివాలయ ఉద్యోగులను ఈ సర్దుబాటు కార్య క్రమం పేరుతో బదిలీ జరుగుతుంది.