TRINETHRAM NEWS

వికీపీడియాపై ఇప్పటికే పలుమార్లు వ్యంగ్యంగా కామెంట్లు చేసిన మస్క్

వికీపీడియా పేరు మారిస్తే బిలియన్ డాలర్లు ఇస్తానని ఆఫర్

వినియోగదారుల నుంచి నిధులు సేకరించాల్సిన అవసరం వికీకి ఏముందని ప్రశ్న

Trinethram News : ప్రపంచంలో ఎవరికి ఏ సమాచారం కావాలన్నా వికీపీడియాను ఆశ్రయిస్తారు. ప్రజలకు వికీపీడియా ఉచితంగానే సమాచారాన్ని అందిస్తోంది. విరాళాలపై ఆధారపడి ఆ సంస్థ పని చేస్తుంటుంది. వికీపీడియా ఓపెన్ చేస్తే విరాళాలకు సంబంధించిన సందేశం కూడా కనిపిస్తుంటుంది. వికీపీడియాపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇప్పటికే పలుమార్లు వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. తాజాగా మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

వికీపీడియాకు బిలియన్ డాలర్లు ఇవ్వడానికి తాను సిద్ధమేనని… అయితే, దాని పేరును (రాయడానికి వీలులేని ఒక అసభ్యకర పేరుగా) మారిస్తే తాను బిలియన్ డాలర్లు ఇస్తానని చెప్పారు. వినియోగదారుల నుంచి నిధులు సేకరించాల్సిన అవసరం వికీమీడియా ఫౌండేషన్ కు ఏముందని మీరెప్పుడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. వికీపీడియా నిర్వహణకు అంత డబ్బు అవసరం లేదని… మరి ఎందుకు విరాళాలు అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. పేరు మారిస్తే తాను డబ్బులు ఇస్తానని చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Elon Musk