
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 14 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు సుందరికరణ పనులలో భాగంగా చేపడుతున్న గుర్రపు డెక్క తొలగింపు పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎల్లమ్మ చెరువు సుందరికరణ, సంరక్షణ, అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది అని, గుర్రపు డెక్క తొలగింపు పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. గుర్రపు డెక్క తొలగింపు ద్వారా దోమల బెడద తగ్గునని అన్నారు.
అదేవిధంగా చెరువు సుందరికరణలో భాగంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ, మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ నిర్మాణం మరియు అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం, పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని తెలియచేసారు. కార్యక్రమంలో భాగంగా ఎంటమాలజీ సిబ్బందితో కలిసి దోమల నివారణ కొరకు ఎం ఎల్ ఓ ఆయిల్ బాల్స్ ను చెరువులో వేయడం జరిగింది.
ఆయిల్ బాల్స్ ను చెరువులో వేయడం వల్ల లార్వ దశలోనే దోమలు మృతి చెందుతాయి కాబట్టి వ్యాప్తి జరగకుండా నియంత్రించవచ్చని అన్నారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, పాండుగౌడ్, పోశెట్టిగౌడ్, మురళి, ఎంటమాలజి సూపర్వైజర్ డి.నరసింహులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
