TRINETHRAM NEWS

సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదం భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేసింది. పదేళ్లలో మోదీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేశాయి. బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారు. ఆత్మనిర్భర భారత్‌ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడింది.

సమ్మిళిత, సంతులిత ఆర్థిక విధానాలతో చిట్టచివరి వ్యక్తికీ ప్రగతి ఫలాలు అందాయి ఇంటింటికీ విద్యుత్‌, ఉపాధి, తాగునీరు సమ్మిళిత అభివృద్ధికి నినాదాలు. కునారిల్లుతున్న వ్యవసాయ రంగానికి మా ప్రభుత్వం కొత్త ఊపిరి ఊదింది. మద్దతు ధరలు, పెట్టుబడి రాయితీలతో రైతులకు ప్రయోజనాలు కల్పించాం. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా అవతరించేందుకు కృషి చేస్తున్నాం. అన్నదాతలకు కనీస మద్దతు ధరను దశల వారీగా పెంచాం. మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నాలుగు వర్గాలకు ప్రాధాన్యమిచ్చింది పేదలు, మహిళలు, యువత, అన్నదాలను శక్తిమంతం చేసింది.

కుల, మత ఆర్థిక బేధాలు లేకుండా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నాం. 2047నాటికి అసమానత, పేదరికం కనబడకుండా చేయాలన్నదే లక్ష్యం. పేదలకు జన్‌ధన్‌ ఖాతాల ద్వారా రూ.34లక్షల కోట్లు అందించింది. 78లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థికసాయం అందించాం. రూ.2.20లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలు అందించాం.