జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 19 at 12.10.12

TRINETHRAM NEWS

Trinethram News : గాజులరామారం నల్లగుట్ట శ్రీభ్రమరాంభ మల్లికార్జున దేవస్థానం ఆవరణలో ఈనెల 24వ తేదీన జరుగనున్న ద్వాదశ జ్యోతిర్లింగ శివ పడిపూజ మహోత్సవ పోస్టర్ ను ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రజాప్రతినిధులు, శివ స్వాములు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
అదే విధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.
కొంపల్లికి చెందిన సాయికిరణ్ గౌడ్ తన పుట్టినరోజు సందర్బంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

You cannot copy content of this page