
నెల్లూరు జిల్లా కావలి మండలం కొత్తపల్లిలో గురువారం రాత్రి ప్రమాదం జరిగింది. కావలి మండలం రాజువారి చింతలపాలెంలోని పడమటి పాలెం చెందిన డ్రైవర్ వెంకటేశ్వర్లు వరి కోత మిషన్ వద్ద పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కట్టర్ మిషన్ లో డ్రైవర్ చెయ్యి ఇరుక్కుపోయింది. దీంతో అతి కష్టం మీద డ్రైవర్ వెంకటేశ్వర్లు చెయ్యిని బయటికి తీశారు.
అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ చెయ్యి పూర్తిగా నుజ్జు నుజ్జు అయి విరిగిపోయింది. హుటా హుటిన అతన్ని నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
